Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న కస్టడీ (Custody) ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి (Arvind Swamy) విలన్‌గా నటిస్తున్నాడు.
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం కస్టడీ (Custody) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన ప్రీ, లుక్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి (Arvind Swamy) విలన్‌గా నటిస్తున్నాడు.
మేకర్స్ తాజాగా అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. సెల్ బ్యాక్ డ్రాప్లో టన్నెల్, ట్రాక్ కనిపిస్తుండగా.. మధ్యలో అరవింద్ స్వామి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. టైటిల్‌కు తగ్గట్టు పాత్రలన్నీ కస్టడీలో ఉన్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది కస్టడీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉప్పెన ఫేం కృతిశెట్టి మరోసారి కస్టడీలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బంగార్రాజు సినిమా తర్వాత కృతిశెట్టి, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్ శివగా కనిపించబోతున్నాడు చైతూ. కస్టడీలో వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
కస్టడీ గ్లింప్స్ వీడియో..
Mad crazy the very dangerous Raju AKA Raazu from #custody @thearvindswami pic.twitter.com/s8OPQXQP7e
— venkat prabhu (@vp_offl) March 2, 2023
Read Also :
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

