Allu Arjun | తెలుగు, మలయాళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu arjun). తన యాక్టింగ్, డ్యాన్స్ తో స్టైలిష్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ యాక్టింగ్‌కు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. పుష్పతో ఐకాన్ స్టార్‌గా క్రేజ్ కొట్టేసిన బన్నీ ఖాతాలో అరుదైన మైల్ స్టోన్ చేరింది.
ఇన్స్టాగ్రామ్ (Instagram)లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది. పుష్ప సినిమా క్రేజ్‌తో బన్నీకి వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. నెటిజన్లు, అభిమానులు అందిస్తున్న ప్రేమాభిమానాలతో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్ల అరుదైన మైలురాయికి చేరిపోయింది. దక్షిణాది నుంచి ఇలాంటి అరుదైన మార్క్ అందుకున్న తొలి నటుడిగా రికార్డుల్లోకెక్కాడు బన్నీ.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ పుష్ప..ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్‌తోపాటు పలువురు పాపులర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప.. ది రైజ్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నాడు.
Icon Star @alluarjun becomes the first actor from South to reach 20 Million followers on Instagram. This new milestone is a testament to the love and admiration that the actor enjoys from fans in the country and across the world. pic.twitter.com/Bvbhh4kbMJ
— BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2023
Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్