Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడంలో ముందుంటారు. తాజాగా ఆయన క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా విడుదలైన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో ఫ్యాన్స్‌కి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చి, పెద్ద ఉత్కంఠను సృష్టించింది. ఈ వీడియో పూర్తిగా జపనీస్ థీమ్, మార్షల్ ఆర్ట్స్ అంశాలతో రూపకల్పన చేయబడింది. ఎర్రటి సూర్యుడు, జపనీస్ అక్షరాలు, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రారంభమయ్యే వీడియో చివర్లో, కటానా కత్తిని పట్టుకున్న ఒక వ్యక్తి “PK” అక్షరాల టి-షర్ట్‌లో కనిపించడంతో అతను పవన్ కళ్యాణ్ కావచ్చని ఊహాలోచన చేస్తున్నారు.
వీడియోలో చివరకి పవన్ కళ్యాణ్ గాలిలోకి ఎగిరి కిక్ ఇవ్వడం వంటి సన్నివేశం చూపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇది ఫ్యాన్స్‌లో భారీ అంచనాను సృష్టించింది. పవన్ కళ్యాణ్ తన బ్యానర్ ద్వారా పెద్ద స్థాయి మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారా? లేక కేవలం బ్యానర్ రీ-లాంచ్ కోసం ప్రత్యేక వీడియోనా? అన్న సందేహాలు ఉన్నాయి. గతేడాది ‘OG’ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ మీద తిరిగి దృష్టి పెట్టడం, ఆయన క్రియేటివ్ వైపు ఉన్న ఆసక్తిని మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సినిమానా, వెబ్ సిరీస్ లేదా స్పెషల్ డాక్యుమెంటరీ అయినా, త్వరలో స్పష్టత రాబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా రాజకీయ బాధ్యతలు చేపడుతున్నప్పటికీ, సినిమాలపై పూర్తిగా దృష్టి కోల్పోలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని 2026 సమ్మర్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అదనంగా, రామ్ తాళ్లూరి నిర్మించిన, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ తన కెరీర్ ప్రారంభం నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ప్రదర్శించారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో తన స్కిల్స్ చూపించారు. ఈ వీడియో కూడా ఆయన క్రియేటివ్, ఫిట్నెస్, ఫైట్ సీన్స్ పై ఆసక్తిని మరోసారి గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చేస్తున్న ప్రతి ప్రయత్నం అభిమానులలో ఉత్కంఠను రేపుతూనే ఉంటుంది.
It Begins !!#PawanKalyanCreativeWorks pic.twitter.com/shEBromdRO
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 6, 2026