Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి దాదాపు కిలో వరకు దొరికింది.
పట్టుబడిన గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు బయపడిన నిందితులు విమానంలోనే ఈ గంజాయిని వదిలివెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్( మట్టి లేకుండా సాగు చేసే ) గంజాయిని ఇండియాకు తరలించడం ఇటీవల పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న వారిపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ) అధికారులు నిఘా పెంచారు.