Thalaivar 170 | యాక్టింగ్‌లో, స్టైల్లో తలైవా రూటే సెపరేటు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడు పదుల వయస్సు దాటినా ఫుల్ ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒకే చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. అభిమానులకు వినోదాన్ని అందించేందుకు తగ్గేదేలే అనే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. రజినీకాంత్ ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తలైవా 169వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తలైవా 170 (Thalaivar 170)వ సినిమా అప్డేట్ అందించి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) చైర్మన్ సుబాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రకటన చేశారు మేకర్స్. జై భీమ్ లాంటి సూపర్ హిట్ సోషల్ డ్రామాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. తలైవా 170 ప్రొడక్షన్ పనులను వన్ ఆఫ్ ది లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ జీకేఎం తమిళ్ కుమరన్ పర్యవేక్షించనున్నారు. మొత్తానికి ఈ సారి టీజే జ్ఞానవేళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్ లాల్, సునీల్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జైలర్ గ్లింప్స్ వీడియోతోపాటు మోహన్ లాల్, సునీల్, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ తలైవా 170 అప్డేట్ ఇలా..
We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗
Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸
🤝 @gkmtamilkumaran
🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5— Lyca Productions (@LycaProductions) March 2, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్