టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. రానాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు.
తనకు రానా నాయుడు చాలా ఎక్జయిటింగ్ జర్నీ అన్నాడు వెంకీ. సినిమాకు, వెబ్ షోకు పనిచేయడం డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే వెబ్ సిరీస్‌లో స్టోరీ టెల్లింగ్ (కథన శైలి)కు తగ్గట్టుగా మెదిలే విషయంలో తనకు కొంత సమయం పట్టిందని చెప్పాడు. వెబ్ సిరీస్‌లో నెగెటివ్ రోల్లో నటించడం కారణంగా.. కొత్త విభాగంలో ఇప్పటివరకు తెలియని విషయాలను నేర్చుకునే అవకాశం దొరికిందని అన్నాడు.
వెబ్ సిరీస్‌లో భిన్నమైన పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నాగ నాయుడు పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. రానాకు నాకు మధ్య ఆఫ్ స్క్రీన్ బాండింగ్ చాలా బాగున్నా.. అతడికి ప్రత్యర్థిగా నటించడం చాలా కష్టమైంది. ఆన్ స్క్రీన్‌లో రానాకు, నాకు మధ్య యుద్దాన్ని తలపించే సన్నివేశాల్లో నటించడం చాలా పెద్ద టాస్క్‌గా మారింది. ఓ ఆర్టిస్టుగా వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశం రావడం మంచి విషయమన్నాడు వెంకటేశ్.
ప్రేక్షకులు వెబ్ సిరీస్‌లో కొత్త కొత్త భావోద్వేగాలు, పరిస్థితులు, పాత్రలతో కనెక్ట్ అయిపోతారని చెప్పుకొచ్చాడు వెంకటేశ్. సుందర్ ఆరన్ ఆఫ్ లోకొమోటివ్ గ్లోబల్ మీడియా ఎల్ఎల్పీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ క్రైం డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. వెంకీ-రానా కాంబినేషన్ ఇప్పటికే కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విషయం తెలిసిందే. మరి బాబాయి-అబ్బాయి ఈ సారి వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్