Gopichand 31 | రూటు మార్చిన గోపీచంద్.. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో కొత్త సినిమా
శ్రీవాసు డైరెక్షన్లో తెరకెక్కుతున్న గోపీచంద్ 30 (Gopichand 30)తో బిజీగా ఉన్నాడు గోపీచంద్. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోపీచంద్ ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో సినిమాకు సంతకం చేశాడు.
టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) ఇప్పటికే గోపీచంద్ 30 (Gopichand 30)తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ 30కి రామబాణం టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రీవాసు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటివరకు తెలుగు దర్శకులతో పనిచేసిన గోపీచంద్ ఈ సారి కాస్త రూటు మార్చాడు. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో సినిమాకు సంతకం చేశాడు. గోపీచంద్ కొత్త సినిమా ఇవాళ ఘనంగా ప్రారంభమైంది.
కన్నడ దర్శకుడు ఏ హర్ష (A Harsha) డైరెక్షన్లో గోపీచంద్ 31గా (GopiChand 31) ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం జరుపుకుంది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలతోపాటు ఇతర ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివరలో షురూ కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
గోపీచంద్ 31కు స్వామి జే సినిమాటోగ్రాఫర్. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతుండగా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు. షూటింగ్ దశలో ఉన్న గోపీచంద్ 30 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత శ్రీవాసు-గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నారు.
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023
Read Also :
Venkatesh | వెబ్ షోకు పనిచేయడం చాలా డిఫరెంట్.. వెంకటేశ్ చిట్ చాట్
Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

