Khammam | ఖమ్మం కాంగ్రెస్‌లో అసంతృప్త జ్వాలలు.. బరిలో నిలవాలని పోట్ల నాగేశ్వరరావుపై అనుచరుల ఒత్తిడి
ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురాంరెడ్డిని ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతల్లో నెలకొన్న అంసతృప్తి ఒక్కసారిగా భగ్గుమన్నది.
- ఎన్నికల ప్రచారానికి కీలక నేతల హాజరుపై ఫోకస్
- రంగంలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రఘురాంరెడ్డి
Khammam | ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురాంరెడ్డిని ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతల్లో నెలకొన్న అంసతృప్తి ఒక్కసారిగా భగ్గుమన్నది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అనుచరులు శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సమావేశమై పోట్లకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని ఆయన అనుచరుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. 17 లోక్‌సభ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా కమ్మ సామాజికవర్గానికి కేటాయించలేదని చర్చించుకున్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని పార్టీ ఖరారు చేసిన తర్వాత ఈ నెల 25న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన పొంగులేటి ప్రసాదరెడ్డి మినహా ఏ ఒక్కరూ హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు కూడా గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ నేతలు పార్టీ ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా? వద్దా? అని భావిస్తున్నట్టు సమాచారం.
అసంతృప్తులకు నేతల బుజ్జగింపులు
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరిరోజు కావడంతో.. రెబల్ నామినేషన్లను ఉసంహరింపజేసేందుకు కాంగ్రెస్ నేతలు పోట్ల నాగేశ్వరరావు, యాదయ్యలతో మంతనాలు జరుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

