విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఓ ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. కన్ఫ్యూజన్ కామెడీ కథాంశంతో దర్శకుడు కె.వి.అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఆయన ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని మించి ఈ సినిమా ఉంటుందని, ప్రేక్షకులకు వినోదాల విందును ఈ చిత్రం అందించనున్నదని మేకర్స్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందులో విశ్వక్సేన్ మూవీ డైరెక్టర్‌గా కనిపించనున్నారు. ఆయన లుక్, యాటిట్యూడ్ భిన్నంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం యూత్‌కి ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ సారంగం, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్.