Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారని తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారీ ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. ఈ నెల 17న పాట్నాలోని గాంధీ మైదాన్ సాయంత్రం 5 గంటల నుంచి పుష్ప ది రూల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. మొత్తానికి పుష్పరాజ్ మేనియా ఈ సారి గట్టిగానే ఉండబోతుందని తాజా పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Get ready for the BIGGEST EVENT on the banks of the Ganges ❤️🔥
3Days to go 💥💥
The MASSIVE #Pushpa2TheRuleTrailer Launch Event on November 17th at 𝐆𝐚𝐧𝐝𝐡𝐢 𝐌𝐚𝐢𝐝𝐚𝐧, 𝐏𝐚𝐭𝐧𝐚 from 5 PM Onwards 💥💥
▶️ https://t.co/vZDHUYyV0F#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th… pic.twitter.com/SYMIBorPVE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2024
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట