Allu Arjun | సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 16 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే కోటి 60 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కేవలం 10 రోజుల్లోనే ఈయనకు 1 మిలియన్ ఫాలోయర్స్ పెరిగారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నర ఏళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం.
2017 నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ వచ్చాడు ఐకాన్ స్టార్. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 16 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా అల్లు అర్జున్ను సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈయన తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. తనకు 16 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్లోనూ అల్లు అర్జున్‌కు 7 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్బుక్లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప: రి రైజ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాతే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
బోయపాటి శ్రీను నెక్ట్ టార్గెట్ ఎవరు.. బన్నీ నా? రామ్ పోతినేని నా..?
పదేండ్ల క్రితం మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు?
Pushpa 2 | పుష్ప 2 సినిమాకు 400 కోట్ల ఆఫర్.. నిర్మాతలు ఏమన్నారంటే..?
Allu Arjun | ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?