Tollywood heroes remuneration | ఒకప్పుడు పెద్ద సినీ ఇండస్ట్రీ ఏది అంటే బాలీవుడ్ అనేవాళ్లు.. అక్కడి వచ్చిన సినిమాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించేవి. అందుకే బాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు కూడా కోట్లల్లో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. బాలీవుడ్ కూడా నెత్తిమీద పెట్టుకునేలా సౌత్ నుంచి సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు మన దగ్గరే కాకుండా బాలీవుడ్‌లోనూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. గత పదేండ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి.. టాలీవుడ్ హీరోల స్థాయి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. దీంతో వాళ్ల రెమ్యునరేషన్ కూడా అంతేస్థాయిలో పెరిగిపోయింది. కొంతమంది హీరోలకు అయితే ఇప్పుడు రెమ్యునరేషన్లతో పాటు వాటాలు కూడా అందుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు మినిమం టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. అందుకే ప్రొడ్యూసర్లు కూడా హీరోలు అడిగినంత ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో పదేండ్ల క్రితం ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓక్కో సినిమాకు 100 నుండి 150 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నాడు. కానీ పదేండ్ల క్రితం డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే అందుకునేవాడు.
ఇక ట్రిపుల్ అర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు చెరో 50 కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం. కానీ అప్పుడు అదుర్స్, బృందావనం సినిమాలకు ఎన్టీఆర్ 9 కోట్ల పారితోషికం అందుకోగా.. ఆరెంజ్, రచ్చ సినిమాలకు 6 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన సినిమాలకు దాదాపుగా తనే కో ప్రోడ్యూసర్‌గా ఉంటున్నాడు. అదే ఖలేజా, దూకుడు సినిమాలకు 8కోట్ల వరకు పారితోషకాన్ని అందుకున్నాడట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల నుండి 75 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. కానీ జల్సా, కొమరం పులి సినిమాలకు 7.5 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసకునేవాడట.
పుష్పతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు దాదాపుగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడు కానీ అప్పుడు వరుడు, వేదం సినిమాలకు 5 నుండి 6 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకున్నాడు.
పదేండ్ల క్రితం ఉన్న రెమ్యునరేషన్లకు ఇప్పుడు ఉన్న పారితోషికాలు పదింతలు పెరిగాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా ఇండస్ట్రీలు కూడా వీళ్ల సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రొడ్యూసర్లు కూడా లాభపడుతున్నారు. అందుకే మన హీరోలకు కూడా రెమ్యునరేషన్లు భారీగానే అందజేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు