ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండే బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోలు అతికొద్దిమందే ఉంటారు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఈ ఏడాది రామ్‌సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే రామ్‌సేతు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ స్టార్ హీరో రాజ్ మెహతా డైరెక్షన్లో నటిస్తున్న సినిమా సెల్ఫీ (Selfiee). ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించాడు అక్షయ్‌కుమార్. ఓ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన కొత్త స్టిల్‌ను షేర్ చేస్తూ.. పాట చిత్రీకరణ కొనసాగుతున్నట్టు తెలియజేశాడు. స్టైలిష్ అవతార్‌లో అదరగొట్టేస్తున్నాడు అక్షయ్. అంతేకాదు 2023 ఫిబ్రవరి 24న థియేటర్లలో సందడి చేయనుందని అప్డేట్ ఇచ్చాడు.
మలయాళ యాక్టర్లు పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) హిందీ రీమేక్‌గా వస్తోంది సెల్ఫీ. ఈ చిత్రంలో దియానా పెంటీ, నుస్రత్ భరూచా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, అక్షయ్ కుమార్ హోం బ్యానర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, సుకుమారన్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
My mantra for today – Garmi, humidity aur faux fur…Sab chalega, bas kaam kar, kaam kar 😬
Shooting a mast new song for #Selfiee.
See you in cinemas, February 24. pic.twitter.com/dJkGxArjM1— Akshay Kumar (@akshaykumar) December 13, 2022
Read Also : Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
Read Also : Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
Read Also : Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను