Virupaksha | పోస్టర్‌తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష కొత్త అప్డేట్
SDT15 ప్రాజెక్ట్‌గా వస్తున్న విరూపాక్ష (Virupaksha) గ్లింప్స్ వీడియో ఇప్పటికే విడుదలవగా.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాగుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha) . SDT15 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే విడుదలవగా.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో సాగుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా తాజాగా తమిళ వెర్షన్ గ్లింప్స్ వీడియో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష తమిళ గ్లింప్స్ వీడియోను డిసెంబర్ 14 (రేపు)న ఉదయం 10:30 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు.
మంట పెట్టిన కర్రను చేతిలో పట్టుకుని రిలీజ్ చేసిన లుక్ సినిమాపై ఆసక్తినిరేకెత్తిస్తుంది. కార్తీక్ దండు (Karthik Dandu) విరూపాక్ష చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కాంతారకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
విరూపాక్షలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు సాయిధరమ్ తేజ్. చాలా కాలానికి కొత్త సినిమా అప్డేట్స్ అందిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు సాయిధరమ్ తేజ్.
క్యూరియాసిటీ పెంచుతున్న లుక్..
An intriguing mystic world awaits you…🔥🔥
After winning a huge applause in Telugu, the title glimpse of @IamSaiDharamTej's #Virupaksha is now releasing in Tamil on Dec 14th at 10: 30 AM.
@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @aryasukku pic.twitter.com/CHA12GYptF— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2022
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

