Mission Majnu | ఓటీటీలోనే రష్మిక మందన్నా హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్ను
రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి హిందీ చిత్రం గుడ్‌బై ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. ఇక రష్మిక నటిస్తున్న మరో హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేటర్లలోనే వస్తుందనుకున్న సినీ జనాలకు నిరాశే ఎదురైంది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి హిందీ చిత్రం గుడ్‌బై. ఈ ఏడాది గుడ్‌బై ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం గుడ్‌బై ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. ఇక రష్మిక నటిస్తున్న మరో హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేటర్లలోనే వస్తుందనుకున్న సినీ జనాలకు నిరాశే ఎదురైంది.
మిషన్ మజ్ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవనుంది. ఈ చిత్రం జనవరి 20న విడుదల కానుందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. భారీ ఆశలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మికకు మొదటి సినిమా గుడ్‌బై సరిగ్గా ఆడలేదు. ఇక రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీటీలో వచ్చేస్తుంది. హిందీలో ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయిన రష్మిక మందన్నా ప్రస్తుతం ఆశలన్నీ రణ్‌బీర్‌కపూర్‌తో చేస్తున్న యానిమల్పైనే పెట్టుకుంది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి బ్రేక్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే లీకైన కొన్ని స్టిల్స్ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశాయి. మరి యానిమల్తోనైనా బ్రేక్ వచ్చేనా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రష్మిక మరోవైపు పుష్ప.. ది రూల్ షూటింగ్లో కూడా చేరేందుకు రెడీ అవుతోంది.
మిషన్ మజ్ను నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ అప్డేట్..
Ek jaanbaaz agent ki ansuni kahaani.
MISSION MAJNU 🇮🇳
Only on Netflix, 20th January. pic.twitter.com/mFy3YIcDlH— Netflix India (@NetflixIndia) December 13, 2022
And now it’s Mission Majnu time ❤️
Are y’all ready my loves ? 😚❤️#MissionMajnu #DeshKeLiyeMajnu #NetflixIndia pic.twitter.com/hKYRx2B2DI— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

