Rolex | సూర్యతో రోలెక్స్ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ప్లాన్.. ముహూర్తం ఎప్పుడో ..?
ఖైదీ సినిమాతో స్టార్ హీరోలు, అగ్రనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ వచ్చిన భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ విక్రమ్. ఈ చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్ (Rolex) పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది.
కార్తీ లీడ్ రోల్లో తెరకెక్కించిన ఖైదీ చిత్రంతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ సినిమా సక్సెస్‌తో స్టార్ హీరోలు, అగ్రనిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సీక్వెల్ ప్రాజెక్ట్ ఖైదీ 2ను కూడా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ వచ్చిన భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ విక్రమ్. కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, విక్రమ్ కీలక పాత్రల్లో నటించారు.
విక్రమ్‌లో సూర్య (Suriya) పోషించిన రోలెక్స్ (Rolex) పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది. రోలెక్స్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచింది. అయితే ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. రోలెక్స్ ఆధారంగా ఓ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని ఇంటర్వ్యూలో చెప్పాడు లోకేశ్ కనగరాజ్. అంతేకాదు థళపతి 67, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలతోపాటు పలు ప్రాజెక్టులతో రాబోయే పదేండ్లు తాను చాలా బిజీగా ఉంటానని చెప్పుకొచ్చాడు.
విజయ్‌తో తెరకెక్కిస్తున్న థళపతి 67 షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు లోకేశ్. కొత్తదనంతో కూడిన ప్రయోగాత్మక కథలను సిల్వర్ స్క్రీన్‌పై పర్ఫెక్ట్గా చూపించడంలో లోకేశ్ కనగరాజ్ రూటే వేరని ఆయన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇక విలక్షణ, ప్రయోగాత్మక పాత్రలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటాడు సూర్య.

మరి రాబోయే కాలంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని, అది కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రోలెక్స్ పేరుతో ఉండబోతుందన్న అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు. మరి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ సెలబ్రిటీల కాంబోలో సినిమాకు ముహూర్తం ఎప్పుడు కుదురుతుందని టైం డిసైడ్ చేస్తుంది.
Read Also : Butterfly Trailer | అనుపమ పరమేశ్వరన్ మిస్టరీ థ్రిల్లర్ బట్టర్ ఫ్లై ట్రైలర్
Read Also : Vijay Sethupathi | స్లిమ్‌గా విజయ్‌సేతుపతి.. ఈ లుక్‌తో సినిమా చేయరా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

