Butterfly Trailer | అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన 18 పేజెస్ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ నటిస్తోన్న మరో చిత్రం బట్టర్ ఫ్లై (Butterfly) అప్డేట్ వచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ (Butterfly Trailer)ను మేకర్స్ లాంఛ్ చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేసి వారిని చంపుతుంటాడు. ఈ క్రమంలో అనుపమ పిల్లలను కూడా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత తన పిల్లలను అనుపమ కాపాడుకుందా..? లేదా అనేది కథ. సస్పెన్స్ క్రియేట్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 29న ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో భూమికా చావ్లా, రావు రమేశ్, నిహాల్ కోధాటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర దక్షిణాది ప్రధాన భాషల్లో విడుదల కాబోతుంది. ఘంటా సతీశ్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రవిప్రకాశ్ బోడపాటి నిర్మిస్తున్నారు.
బట్టర్ ఫ్లై ట్రైలర్..
బట్టర్ ఫ్లై టీజర్..
Read Also : Okkadu | మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. ఒక్కడు రీ రిలీజ్ టైం ఫిక్స్
Read Also : Vijay Sethupathi | స్లిమ్‌గా విజయ్‌సేతుపతి.. ఈ లుక్‌తో సినిమా చేయరా అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్