Akshay kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి జాలీ ఎల్ఎల్బీ 3. ఈ మూవీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షయ్‌కుమార్ సర్ఫీరా (Sarfira) సినిమాపై ఫోకస్ పెట్టాడు. జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత రాధికా మదన్‌తో కలిసి సర్ఫీరా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.
పూణే ఎయిర్‌పోర్టులో అక్షయ్‌కుమార్, రాధికామదన్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుధా కొంగర (Sudha Kongara)-సూర్య కాంబోలో వచ్చిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రీమేక్‌గా సర్ఫీరా వస్తోంది. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించాడు. సర్ఫీరా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. తనిష్క్ బాగ్ఛీ, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంఛైజీల్లో ఒకటి జాలీ ఎల్ఎల్బీ (Jolly LLB) . సుభాష్ కపూర్ డైరెక్షన్లో వస్తోన్న ప్రాంఛైజీ జాలీ ఎల్ఎల్బీ 3లో అక్షయ్‌కుమార్, అర్షద్ వర్షి (ArshadWarsi) నటిస్తున్నారు. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్‌కుమార్, అర్షద్ వర్షి, సౌరభ్ శుక్లా మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరుబోతున్నారు. ఒకేసారి రెండు సినిమాల అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు అక్షయ్‌కుమార్.
And, after completing #JollyLLB3 schedule and 1st Screening at Delhi, #AkshayKumar and #RadhikkaMadan officially start the 1st and last leg of promotions of #Sarfira.@akshaykumar and Radhikka lands in Pune. https://t.co/yMexQnRPfn pic.twitter.com/V0pMfYh8Er
— Ashwani kumar (@BorntobeAshwani) July 8, 2024
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?