కొందరు హీరోలకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది కానీ అదృష్టం ఉండదు. అలాంటి హీరోలలో అఖిల్ కూడా ఉంటాడు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజు దాదాపు 50 కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడిగా ఉండేవాడు అఖిల్ అక్కినేని. ఈయన తొలి సినిమా విడుదలకు ముందు సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భారీ హైప్.. అంతకుమించి బిజినెస్..దానికి మించిన మార్కెట్..అన్నీ బ్యాలెన్సింగ్‌లో ఉండి అఖిల్ తొలి సినిమా వచ్చింది. అఖిల్ పేరుతోనే వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 2015లోనే 30 కోట్ల బడ్జెట్..40 కోట్ల బిజినెస్ చేసింది అఖిల్. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే కచ్చితంగా 50 కోట్ల షేర్ వసూలు చేసేది ఈ చిత్రం. ఎందుకంటే అంతటి డిజాస్టర్ టాక్ తోనే తొలిరోజే 8 కోట్ల షేర్ వసూలు చేసింది అఖిల్. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆరేళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు అక్కినేని వారసుడు.
అన్నీ ఫ్లాపులే కావడంతో అఖిల్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో పడిపోయింది. ఈ సమయంలోనూ హీరో జోరు తగ్గించడం లేదు కదా ఇంకా పెంచేస్తున్నాడు. లాక్డౌన్ తర్వాత వరస సినిమాలు ఒప్పుకుంటున్నాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. 2021 జూన్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ స్పై థ్రిల్లర్ కు ఓకే చెప్పాడు అఖిల్. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఖరారు చేశారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ స్టైలిష్ డైరెక్టర్ అఖిల్ ను కొత్తగా చూపించబోతున్నాడు.
ఈ సినిమా కోసం బరువు కూడా భారీగానే పెరుగుతున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలు కానుందని తెలుస్తుంది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. కథ డిమాండ్ చేస్తుంది కాబట్టే అంత బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. ఈ సినిమాతో కచ్చితంగా అఖిల్ అక్కినేని తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను గుర్రాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు అఖిల్. మరి ఈ సినిమాతో ఆయన విజయం అనుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
జార్జియాలో విజయ్-నెల్సన్ టీం
జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో