Ajay Gnanamuthu | డిమోంటే కాలనీ సినిమా తెరకెక్కించి ఎంట్రీతోనే డైరెక్టర్‌గా మంచి హిట్టందుకున్నాడు కోలీవుడ్ దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు (R Ajay Gnanamuthu). డిఫరెంట్ స్టోరీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. అజయ్ జ్ఞానముత్తు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. తన ప్రియురాలు షిమోనా (Shimona)ను పెళ్లి చేసుకున్నాడు అజయ్ జ్ఞానముత్తు.
జనవరి 19న చెన్నైలో జరిగిన ఈవెంట్లో అజయ్ జ్ఞానముత్తు-షిమోనా వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితంలో అడుగుపెడుతున్న వధూవరులకు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. యాక్టర్లు ఆనంద్ రాజ్, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్, నిర్మాతలు కేఈ జ్ఞాన్వేళ్ రాజా, రాజశేఖర్ పాండ్యన్ వధూవరులను ఆశీర్వదించారు.
2015లో హార్రర్ జోనర్లో విడుదలైన డిమోంటే కాలనీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత విక్రమ్‌తో కోబ్రా సినిమా తెరకెక్కించాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో డిమోంటే కాలనీ 2 కూడా వచ్చింది.
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్