తన యాక్టింగ్‌తో తెలుగు, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). ఈ బ్యూటీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం డ్రైవర్ జమున (Driver Jamuna). లేడీ ఓరియెంటెడ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ క్యాబ్ డ్రైవర్ జమున పాత్రలో నటిస్తోంది. క్లిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కొన్నాళ్ల క్రితం మేకర్స్ డ్రైవర్ జమున ట్రైలర్ ను తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదల చేశారు. నవంబర్ 11న సినిమా విడుదలవుతుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కేవలం తమిళ ప్రమోషన్స్ లో మాత్రమే పాల్గొంటుంది ఐశ్వర్య రాజేశ్ టీం. సాంగ్స్ రిలీజ్, ఇంటర్వ్యూలు, మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ తమిళ వెర్షన్ లో మాత్రమే కొనసాగిస్తున్నారు.
విడుదలకు మరో మూడు రోజులే ఉండటంతో డ్రైవర్ జమున ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే విడుదలవుతుందని, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో రిలీజ్ అయే అవకాశాలు లేవని ఇండస్ట్రీ సర్కిల్లో చర్చ నడుస్తోంది. మరి ఐశ్వర్య రాజేశ్ టీం విడుదలపై ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
డ్రైవర్ జమున ట్రైలర్..
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!