టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ రంగమార్తాండ (Rangamarthanda). విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, సీనియర్ నటి రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam), అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. మొదట ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించాలని అనుకున్నానని, అయితే డైరెక్టర్‌గా కృష్ణవంశీ ఈ కథకు సరైన న్యాయం చేస్తాడని భావించానన్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. యాక్టింగ్, పర్ఫార్మెన్స్ పరంగా.. మీరు కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారంటూ చెప్పుకొచ్చారీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్.
త్వరలోనే రంగమార్తాండ విడుదల తేదీపై కృష్ణవంశీ టీం క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ వీడియోలు, స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్ మూవీస్-రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణవంశీ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు క్యూరియాసిటీగా ఉండటమే కాకుండా.. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!