Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
చెన్నై భామ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). నవంబర్ 11న విడుదల ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంది సామ్. ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పుకొచ్చింది.
తెలుగు, తమిళంతోపాటు హిందీ ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ.. వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది సమంత (Samantha) . ఈ చెన్నై భామ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంది సామ్. ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పుకొచ్చింది.
కథ విన్నపుడు చాలా షాకయ్యా. వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చే కథ విన్నాక గూస్ బంప్స్ వచ్చాయి. మామూలుగా నేను కథ ఒకే చేయడానికి టైం పడుతుంది. కానీ హరి-హరీష్ ఈ కథ చెప్పిన వెంటనే ఒకే చెప్పేశానంది సమంత. షూటింగ్ గురించి మాట్లాడుతూ..ప్రతీ రోజు ప్రతీ సీన్‌కు భయం ఉంటుంది. నా వల్ల అవుతుందా..? కాదా..? భయం ఉంటుందని చెప్పింది.
ఫైట్స్ అంటే ఎక్కువ ఇష్టం..
డ్యాన్స్, ఫైట్స్ లో మీరెక్కువ ప్రాధాన్యమిస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ..ఫైట్స్ కే..నేను ఒక ఫైట్ చేయబోతున్నానంటే..కొంచెం ఎక్జయిటెడ్ అవుతాను. ఈ సినిమాలో టాలెంటెడ్ స్టంట్ కొరియోగ్రఫర్ యానిక్ బెన్తోపాటు వెంకట్‌తో కలిసి పనిచేశా. ఈ ఇద్దరి యాక్షన్ పార్ట్ రోప్స్ కానీ, డూప్ కానీ ఉండకుండా.. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. యశోదలో చాలా చాలా బాగనిపించే కొన్ని యాక్షన్ సన్నివేశాలున్నాయి. యశోద చిత్రంలో తాను ఫైట్స్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నది సమంత.
సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశం చాలా అద్బుతంగా వచ్చిందని, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సాగే ఈ యాక్షన్ పార్టును ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని సామ్ ప్రేక్షకులకు సూచించింది. ఈ సినిమాను నేన్ బిగ్ స్క్రీన్ మీద చూశా. యశోద ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించే సినిమా అని చెప్పింది సామ్
యశోద తాను ఉన్న ప్రపంచానికి తాను వెళ్లిన ప్రపంచానికి సినిమాలో చాలా తేడా ఉంటుంది. ట్రైలర్ గమనిస్తే.. బిగినింగ్‌లో యశోద మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి ఆ తర్వాత కొత్త వరల్డ్‌లోకి రావడం చాలా కొత్తగా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.
యశోద చిత్రానికి మణిశర్మ సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సమంత యశోద ట్రైలర్ ..
యశోద యాక్షన్ పార్ట్ మేకింగ్ వీడియో..
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

