Aishwarya Rai | పుట్టపర్తి (Puttaparthi)లో శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai) కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద ఐశ్వర్యరాయ్ ఆశీర్వాదం తీసుకున్నారు. స్టేజ్‌పై కూర్చున్న ప్రధాని వద్దకు వెళ్లి మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ బహిరంగ కార్యక్రమంలో ఐశ్వర్య మాట్లాడారు. ప్రజలకు సత్యసాయిబాబా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారని అన్నారు.
ఇక ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అక్కడ సత్యసాయి మహాసమాధి (Mahasamadhi)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని, తపాల బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
Also Read..
Fidayeen | భారత్‌లో భారీ దాడులకు జైషే ప్లాన్.. ఫిదాయిన్ కోసం ఆన్లైన్లో విరాళాల సేకరణ
Dangerous Stunt | నలుగురూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా.. నడి రోడ్డుపై ప్రియురాలికి ముద్దులు