SDT 18 | సాయి దుర్గ తేజ్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ SDT18గా రానుండగా రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. మేకర్స్ చాలా రోజుల తర్వాత కొత్త అప్డేట్ అందించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా వస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇవాళ ఐశ్వర్యలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వసంత పాత్ర లుక్ షేర్ చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో కనిపిస్తున్న ఐశ్వర్య లక్ష్మి లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది.
A Breeze in the barren lands 🍃
Unveiling #AishwaryaLekshmi
as VASANTHA from the Magnanimous World of #SDT18 on the occasion of her birthday 💥#HBDAishwaryaLekshmiMega Supreme Hero @IamSaiDharamTej @rohithkp_dir @Niran_Reddy @ChaitanyaNiran @Primeshowtweets pic.twitter.com/79jRXevn51
— BA Raju’s Team (@baraju_SuperHit) September 6, 2024
Nani | నాని-వివేక్ ఆత్రేయ హ్యాట్రిక్ సినిమా.. కొత్త ప్రాజెక్ట్ జోనర్ ఇద
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!