Nani | ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani). ఆగస్టు 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. నాని, వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబోలో వచ్చిన చిత్రం అంటే సుందరానికి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే రెండోసారి వచ్చిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నాని, వివేక్ ఆత్రేయ ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారా..? అంటే తాజా అప్డేట్ అవుననే చెబుతోంది.
ఈ మూవీ సక్సెస్ మీట్లో నాని మాట్లాడుతూ.. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. అంతేకాదు తాను వివేక్ ఆత్రేయతో మరో సినిమా కూడా చేయబోతున్నానని ప్రకటించాడు. రాబోయే సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్లో ఉండబోతుందని కూడా చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఈ కామెంట్స్‌తో నానిని ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో చూసేయొచ్చని తెగ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు, మూవీ లవర్స్. నాని ఇప్పటికే హిట్ 3 సినిమా ప్రకటించాడని తెలిసిందే.
హిట్ ప్రాంఛైజీలో శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 1 2025లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయబోతుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే