ఖైరతాబాద్, జనవరి 8: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్లలో వందకోట్ల అవినీతిపై విద్యార్థి లోకం కదంతొక్కింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని భారీ ధర్నా చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, పరస్పరం తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్టుచేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు అడ్డూ అదుపు లేకుండాపోయాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు చదువుకునే కేజీబీవీ పాఠశాలల్లో మౌ లిక వసతుల పేరుతో జరిగిన టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
నాసిరకం బంకర్ బెడ్స్ సరఫరా చేయడం, టెండర్ల నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా కోట్లాది రూపాయల ప్ర జాధనాన్ని దోచుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో బంకర్ బెడ్‌ను రూ. 12వేలకే స్థానిక ఎంఎస్ఎంఈ సంస్థల ద్వారా కొనుగోలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అదే బెడ్‌ను మధ్యప్రదేశ్ నుంచి రూ.33వేల నుంచి రూ.35వేల వరకు కొనుగోలు చేస్తూ ఒక్కో బెడ్‌పై సుమారు రూ.20వేల ప్రజాధనాన్ని దోచుకుంటున్నదని ఆరోపించారు. మొత్తం 45వేల బెడ్స్‌కు ఒక్కో బెడ్ ధర రూ.33,446గా చూపుతూ సుమారు రూ.164 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని, బాధ్యుతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే టెండర్లు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేజీబీవీల వద్ద ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం.. పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల బాలికల విద్య, భద్రత, భవిష్యత్తును పణంగా పెట్టి కుంభకోణాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక విద్యాశాఖ భ్రష్టుపట్టిం దని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్వీ నాయకులు కడారి స్వామి, శిగ వెంకటేశ్‌గౌడ్, దశరథ్, హరిబాబు, జంగయ్య, యశ్వంత్గుప్తా, రాజేశ్‌నాయక్, ప్రశాంత్, బొల్లు నాగరాజు, శ్రీనునాయక్, నాగేందర్రావు, రాజు, అవినాశ్, కాంత్రి, నితీశ్, విశాల్, అక్షయ్, శ్రీ కాంత్, నర్సింగ్, మిథున్, రాకేశ్, పవన్, రా హుల్, రహమత్ పాల్గొన్నారు.