Rashmika Mandanna | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. కఠిన చర్యలు తీసుకోవాలన్న అమితాబ్
Rashmika Mandanna | నేషనల్ క్రష్‌గా పేరు గాంచిన స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు ఆకతాయిలు రష్మిక ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. ప్రస్తుతం ఆ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
Rashmika Mandanna | సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం. సాంకేతికత సాయంతో కొందరు ఆకతాయిలు సామాన్యులు, స్టార్ సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసి పైశాచిన ఆనందాన్ని పొందుతున్నారు. ఆ మార్ఫింగ్ దృశ్యాలను చూసిన కొందరు నెటిజన్లు అవి నిజమేనేమో అని భ్రమపడుతున్నారు. తాజాగా కొందరు నేషనల్ క్రష్‌గా పేరు గాంచిన స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)ను టార్గెట్ చేశారు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. ప్రస్తుతం ఆ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. వీడియోపై సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, మార్ఫింగ్ వీడియోపై రష్మిక ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఇక రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్లో వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌బీర్‌తో కలిసి రష్మిక ‘యానిమల్’ (Animal) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పాన్ ఇండిమా చిత్రం ‘పుష్ప-2’ లో కూడా నటిస్తోంది.
yes this is a strong case for legal https://t.co/wHJl7PSYPN
— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023
Also Read..
Israel – Hamas War | గాజాను రెండుగా విభజించి భీకర దాడులు.. ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
Virat Kohli | షారుఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేసిన కోహ్లీ.. వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

