Israel – Hamas War | గత నెల ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించి.. గాజా (Gaza) స్ట్రిప్‌పై భీకర దాడులకు దిగింది. నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక (Israeli military) చర్యలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టి.. నగరాన్ని రెండు భాగాలుగా విభజించినట్లు తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ (Daniel Hagari) మాట్లాడుతూ.. ‘గాజా నగరాన్ని మేం నలువైపులా చుట్టుముట్టాం. ఆ నగరాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాం. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ’ అని అన్నారు. కాగా, ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 48 గంటల్లో అటు వైపు నుంచి గాజా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
Also Read..
Virat Kohli | షారుఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేసిన కోహ్లీ.. వీడియో వైరల్
Paris Masters 2023 | ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి.. చేజారిన నంబర్ 1 ర్యాంక్