Paris Masters 2023 : ప్యారిస్ మాస్టర్స్ డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) జోడీకి ఊహించిన షాక్ తగిలింది. మూడో సీడ్‌గా బోపన్న, మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) ద్వయం రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన 90 నిమిషాల పాటు జరిగిన టైటిల్ పోరులో ఏడో సీడ్ సాంటిగ గొంజాలెజ్(మెక్సికో), ఎడ్వర్డ్ రోజర్ వస్సెలిన్(ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. తొలి సెట్ నుంచి సాంటిగ, ఎడ్వర్డ్ ధాటిగా ఆడడంతో 2-6, 7-5, 7-10తో బోపన్న ద్వయానికి ఓటమి తప్పలేదు.
దాంతో, పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నంబర్ 1 అయ్యే అవకాశం కూడా చేజారింది. అద్భుత విజయంతో ట్రోఫీ గెలిచిన సాంటిగో, ఎడ్వర్డ్ జోడీ ఇవాన్ డొడిగ్(క్రొయేషియా), ఆస్టిన్ క్రాజిసెక్(అమెరికా) జోడీని వెనక్కినెట్టి ఏటీపీ మెన్స్ టీమ్ ర్యాకింగ్స్లో నంబర్ 1 స్థానానికి ఎగబాకింది.