Sunil Narine | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్
Sunil Narine : వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్(Sunil Narine) అభిమానులను షాక్‌కు గురిచేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ఆదివారం 35 ఏండ్ల...
Sunil Narine : వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్(Sunil Narine) అభిమానులను షాక్‌కు గురిచేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ఆదివారం 35 ఏండ్ల నరైన్ తెలిపాడు. బ్యాటుతో, బంతితో చెలరేగుతూ.. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల నరైన్ ఇకపై టీ20 లీగ్స్‌లో మాత్రమే ఆడతానని ప్రకటించాడు.
‘నేను విండీస్ టీమ్‌కు ఆడి నాలుగేండ్లు దాటింది. ఈరోజుతో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పుస్తున్నా. నాకు అన్నివిధాలా అండగా నిలిచిన క్రికెట్ వెస్టిండీస్, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞతలు. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ 50 కప్ తర్వాత దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటాను’ అని నరైన్ వెల్లడించాడు.
అనతికాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగిన నరైన్.. 2012లో పొట్టి ప్రపంకప్ చాంపియన్‌గా అవతరించిన విండీస్ జట్టులో సభ్యుడు. గొప్ప స్పిన్నర్ అయినప్పటికీ అతడి బౌలింగ్ యాక్షన్ పలుమార్లు వివాదాస్పదమైంది. దాంతో, నరైన్ 2016 పొట్టి ప్రపంచ కప్‌తో పాటు 2015 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.
2016లో చివరి వన్డే
ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్లో విజయవంతమైన బౌలర్‌గా పేరొందని నరైన్.. జాతీయ జట్టు తరఫున మాత్రం కొన్ని మ్యాచులే ఆడాడు. అతడు విండీస్ తరఫున 6 టెస్టులు, 65 వన్డేలు, 51 టీ20లు ఆడాడంతే. జాతీయ జట్టు తరఫున 2016లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన నరైన.. 2019లో పొట్టి ఫార్మాట్లో చివరి మ్యాచ్ ఆడేశాడు.
బీసీసీఐ ఏటా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నరైన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నవిండీస్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకూ 162 మ్యాచ్‌లు ఆడాడు. 771 పరుగులు చేయడమే కాకుండా 163 వికెట్లు తీశాడు. అయితే.. 16వ సీజన్లో అటు బ్యాటుతో, ఇటు బంతితో నిరాశపరిచిన అతడు వచ్చే సీజన్లో ఏమేరకు రాణిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి
-
Asia Champions Trophy 2023 | గర్జించిన మహిళల హాకీ జట్టు.. రెండోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవసం
-
Minister KTR | నేడు వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనాలు.. హాజరుకానున్న మంత్రి కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

