Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్‌వింగ్ (సోషల్‌మీడియా)ను ప్రారంభిస్తారు. 10.30 గంటలకు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం 11 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న ఐబీపీ గోదాం మైదానంలో నిర్వహించే యువ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీటీసీ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్ధపు మాధవి, బండ నర్సయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, లోక బాపురెడ్డి పాల్గొననున్నారు.
ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రీ డిగ్రీ కళాశాల మైదానంలో యువ ఆత్మీయ సమ్మేళం జరుగనుంది. ఈ సమావేశానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆరు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.