Asia Champions Trophy 2023 | గర్జించిన మహిళల హాకీ జట్టు.. రెండోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కైవసం
Asia Champions Trophy 2023 : సొంతగడ్డపై జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asia Champions Trophy 2023)లో భారత మహిళల హాకీ జట్టు విజేతగా నిలిచింది. రాంచీలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో జపాన్(Japan)పై 4-0తో గెలుపొంది.. రెండోసారి చాంపియన్‌గా....
Asia Champions Trophy 2023 : సొంతగడ్డపై జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asia Champions Trophy 2023)లో భారత మహిళల హాకీ జట్టు విజేతగా నిలిచింది. రాంచీలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో జపాన్(Japan)పై 4-0తో గెలుపొంది.. రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. మరంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. భారత ప్లేయర్ల దూకుడు ముందు గట్టి పోటీనిస్తుందనుకున్న జపాన్ జట్టు తేలిపోయింది.
సంగీత కుమారి, నేహా గోయల్, లర్లెమ్‌సియామి, వందనా కటారియాలు తలొక గోల్ చేయడంతో టీమిండియా అలవోకగా గెలుపొందింది. భారత జట్టు 2016లో మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడాది సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో చైనాను 2-1తో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.
Podium finish for the #WomenInBlue 💙#HockeyIndia #IndiaKaGame #JWACT2023 pic.twitter.com/qWYlDM58gy
— Hockey India (@TheHockeyIndia) November 6, 2023
50 నిమిషాలు ఆలస్యం
స్టేడియంలోని నాలుగు ఫ్లడ్లైట్స్ వెలగకపోవడంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితేనేం.. ఆట మొదలైన కాసేపటికే భారత్ అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సంగీత కుమారి 17వ నిమిషంలో తొలి గోల్ చేయడంతో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. జపాన్ జట్టు డిఫెన్స్‌లో పడిపోగా… నేహా గోయల్ (46వ నిమిషం) లర్లెమ్‌సియామి(57వ నిమిషం), వందనా కటారియా(60వ నిమిషం) గోల్ కొట్టారు. భారత డిఫెండర్లు కూడా అద్భుతంగా పోరాడడంతో జపాన్ టీమ్ మాత్రం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో చైనా 2-1తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli: ఫస్ట్ సెంచరీ చేసిన చోటే సచిన్ రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ
IND vs SA: రికార్డుల హోరు.. సఫారీలపై భారత్ సవారీతో పాత రికార్డుల గల్లంతు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

