Virat Kohli | స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్,
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తూ రికార్డులను తిరగరాస్తున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేలలో
నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. అదీ తనకు ఎంతో ప్రత్యేకమైన పుట్టినరోజు నాడు ఈ రికార్డు నెలకొల్పడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక మైదానంలో బ్యాట్‌తో అలరించే కింగ్ కోహ్లీ.. అప్పుడప్పుడూ తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంటాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ స్టెప్పులేశాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్’ (Jawan) చిత్రంలోని పాపులర్ సాంగ్ ‘చలేయా’ (Chaleya)కు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది. కష్టతరమైన పిచ్‌పై బ్యాటర్ల మొక్కవోని దీక్షకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్ఇండియా అజేయంగా నిలిచింది. ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో రోహిత్ సేన 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తన 35వ పుట్టినరోజు నాడు బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కితే.. శ్రేయస్ అయ్యర్ (77; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి అండగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుత ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది.
Also Read..
Sunil Narine | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్
Air Pollution | ఢిల్లీలో పడిపోయిన వాయు నాణ్యత.. నేడు సీఎం కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశం
IND vs SA: రికార్డుల హోరు.. సఫారీలపై భారత్ సవారీతో పాత రికార్డుల గల్లంతు