RTC Bus | రివర్స్‌కు బదులు ఫస్ట్ గేర్ వేసిన డ్రైవర్.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో (Vijayawada) 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో (Vijayawada) 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరణించినవారిలో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, బాలుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గుంటూరు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చింది.
దీంతో కండక్టర్‌తోపాటు అక్కడ ఉన్న మరో ఇద్దరు మరణించారు. పలువురు బస్సు కింద ఇరుక్కుపోయారు. తక్షణమే స్పందించిన సిబ్బంది.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్లాట్‌ఫామ్ 11, 12 వద్ద ఫెన్సింగ్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. మృతులను బస్సు కండక్టర్ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనవడు అయాన్‌గా గుర్తించారు. కుమారి కోడలు సుకన్యకు కాలు విరిగిపోయింది. కాగా, డ్రైవర్ రివర్స్ గేరుకు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు. బస్సు కండిషన్ బాగానే ఉందని వెల్లడించారు. ఇది మానవ తప్పిదమా లేదా సాంకేతిక తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, 24 గంటల్లోపు విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్ వయస్సు 61 ఏండ్లు అని, ఈ మధ్యే అనారోగ్యానికి గురై కోలుకుని డ్యూటీలో చేరాడని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

