Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Women Professor | వైస్ చాన్సలర్ అల్డాస్ జానయ్య దోషి అని మేం నిర్దారించడం లేదు.. కానీ ఈ రోజు వరకు ఎఫ్ ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆందోళనలో పాల్గొన్న తోటి మహిళా ప్రొఫెసర్ ప్రశ్నించింది.
Women Professor | మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వీసీ అల్డాస్ జానయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు నిరసనకు దిగారు. వీసీ జానయ్యకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తోటి మహిళా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. వైస్ చాన్సలర్ అల్డాస్ జానయ్య దోషి అని మేం నిర్దారించడం లేదు.. కానీ ఈ రోజు వరకు ఎఫ్ ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు.. ఈ వీసీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది ప్రొఫెసర్లను ఇంటికి పంపిస్తాడు.. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంట్లో కూర్చుంటారట.. ఆమె తండ్రి మీద, ఆమె మీద, పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తరు.. ఏ మాత్రం ఆలోచన లేకుండా పోయి మేం సారీ చెప్తే వీసీ చెప్పినట్టేనని కొంతమంది ప్రొఫెసర్లు పోయి బతిమిలాడుతరంట.. మీరు సారీ చెప్తే వీసీ చెప్పినట్టు ఎట్లా అవుతుంది.. అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లే.. పేర్లు కూడా ఒక్కొక్కరివి బయటపెడ్తమని అన్నారు..
ఎందుకంటే ఈ సమాజంలో ఇట్లాంటి బాధితులున్నంత వరకు అట్లాంటి ఒక ఆయనకు మద్దతుగా కోటరీని తయారు చేసుకొని బాధిత మహిళ బయటకు వచ్చి చెప్పుకుంటుంటే కూడా ఆమె మీద బురద జల్లుతున్నరు.. మహిళ వేధింపుల కేసులో కొన్ని రోజులు విధుల నుంచి తప్పుకుంటున్నానని వీసీ తప్పనిసరిగా పక్కకు జరగాలి.. మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని హాస్టల్ నుంచి పిల్లలను బయటకు రాకుండా చేశారు.. వాళ్లు వస్తే బోర్డర్ షిప్ రద్దు చేస్తరట.. శాంతియుతంగా ర్యాలీ చేస్తే బోర్డర్ షిప్ (Boardership) ఎందుకు రద్దు చేస్తరు.. ఈ యూనివర్సిటీతో తెలంగాణ ఉద్యమం చేయలేదా మనం.. ఎలాంటి ఉద్యమాలు చేయలేదు.. అందరం బయటకు వచ్చి కోట్లాడినోళ్లమే కదా.. అంటూ ధ్వజమెత్తారు.
మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై ఈరోజు వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?
ఇప్పుడు బాధితురాలి ఇంటికి కొంతమంది ప్రొఫెసర్లను పంపించి కేసు వెనక్కి తీసుకోవాలని అల్డాస్ జానయ్య వేడుకుంటున్నాడు
అల్డాస్ జానయ్య కొంతమంది ప్రొఫెసర్లను ఒక కోటరీలాగా చేసుకొని బాధిత మహిళపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు
లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే విచారణ జరిగే రోజుల్లో విధుల నుండి పక్కకు జరగాలి
కానీ అల్డాస్ జానయ్య అధికారం అడ్డం పెట్టుకొని ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నాడు
– తోటి మహిళా ప్రొఫెసర్
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

