Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Karnataka HC | కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారాలపై కర్ణాటక హైకోర్టు (Karnataka HighCourt) కీలక వ్యాఖ్యలు చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతీ విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదని పేర్కొన్నది. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేపట్టడానికి చట్టబద్ధమైన నిబంధనలను దాటవేసే అధికారం దానికి లేదని స్పష్టంచేసింది.
Karnataka HC : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారాలపై కర్ణాటక హైకోర్టు (Karnataka HighCourt) కీలక వ్యాఖ్యలు చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతీ విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదని పేర్కొన్నది. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేపట్టడానికి చట్టబద్ధమైన నిబంధనలను దాటవేసే అధికారం దానికి లేదని స్పష్టంచేసింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీకి ఉన్న అధికారాల పరిధిలోలేని నేరాలపై ఆ చట్టం కింద విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజగౌడ, ఆయనతో సంబంధం ఉన్న ఇతరులతో సహా పలువురు పిటిషనర్లపై దర్యాప్తు సంస్థ చేపట్టిన విచారణలను జస్టిస్ ఎంఐ అరుణ్ కొట్టేశారు. ఆస్తుల జప్తును ధ్రువీకరిస్తూ పీఎంఎల్ఏ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది.
అదేవిధంగా పిటిషనర్లలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కోలారు, చిక్కబళ్లాపుర జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ (కోముల్) లోని ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఇటీవల ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ అవకతవకలపై ఎఫ్ఐఆర్ లేదా అధికారిక క్రిమినల్ కేసు నమోదైతేనే ఈడీకి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేతప్ప మనీలాండరింగ్ ఆరోపణలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేపట్టడం సరైన చర్య కాదని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

