girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
girl consumes cough syrup dies | ఒక బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ దగ్గుతో బాధపడుతున్న ఒక వృద్ధుడు బాటిల్లోని దగ్గు మందు తాగాడు. అయితే అది జ్యూస్‌గా ఆ చిన్నారి భావించింది. ఆ బాటిల్లోని దగ్గు మందు అంతా తాగింది. కొంతసేపు ఆడుకున్న తర్వాత నిద్రలోకి జారుకుని మరణించింది.
లక్నో: ఒక బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ దగ్గుతో బాధపడుతున్న ఒక వృద్ధుడు బాటిల్లోని దగ్గు మందు తాగాడు. అయితే అది జ్యూస్‌గా ఆ చిన్నారి భావించింది. ఆ బాటిల్లోని దగ్గు మందు అంతా తాగింది. కొంతసేపు ఆడుకున్న తర్వాత నిద్రలోకి జారుకుని మరణించింది. (girl consumes cough syrup dies) ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 4న పెరాడి గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక తన తల్లి, అమ్మమ్మతో కలిసి బంధువుల ఇంట్లో జరిగిన నామకరణ కార్యక్రమానికి వెళ్లింది.
కాగా, ఆ ఇంట్లో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు దగ్గుతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 7:15 గంటల సమయంలో బాటిల్లో ఉన్న దగ్గు మందు అతడు తాగాడు. ఇది చూసిన ఆ బాలిక ఆ బాటిల్లో జ్యూస్ ఉన్నదని భావించింది. ఆ బాటిల్ తీసుకుని అందులో ఉన్న దగ్గు మందు అంతా తాగేసింది. తన అమ్మమ్మ దగ్గరకు వెళ్లి సీసా మూత పెట్టమని అడిగింది. అలాగే ఆ బాటిల్లో ఉన్నది తాను తాగినట్లు ఆ చిన్నారి చెప్పినట్లు సమాచారం.
మరోవైపు ఆ బాలిక ఆ తర్వాత కొంతసేపు ఆడుకుని నిద్రపోయింది. అయితే అలసట వల్ల ఆ చిన్నారి గాఢ నిద్రలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు మొదట భావించారు. గురువారం ఉదయం 10 గంటలు దాటినప్పటికీ ఆ బాలిక నిద్ర నుంచి మేల్కొనకపోవడంతో వారు ఆందోళన చెందారు. తొలుత స్థానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించాలని చెప్పగా అక్కడకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆ బాలిక మరణించినట్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దగ్గు మందు అధిక మోతాదు వల్లే ఆ చిన్నారి మరణించిందా? అన్నది పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత నిర్ధారణ అవుతుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bottle
- Consumes
- cough syrup
- Dies
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

