e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News Tollywood | చిరంజీవి మళ్లీ ఆ హీరోయిన్‌కే ఫిక్స్ అయ్యాడుగా..!

Tollywood | చిరంజీవి మళ్లీ ఆ హీరోయిన్‌కే ఫిక్స్ అయ్యాడుగా..!

సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడమే ఇప్పుడు కష్టం అయిపోయింది. వాళ్లకు కథలు ఈజీగానే దొరుకుతున్నాయి కానీ.. జోడి మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి హీరోలకు హీరోయిన్‌ను వెతకాలి అంటే దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే ఒకసారి నటించిన హీరోయిన్లతోనే మళ్లీ మళ్లీ నటిస్తున్నారు సీనియర్ హీరోలు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే చేస్తున్నాడు.

తాజాగా చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత మరోసారి మెగాస్టార్ ఆయనతో రొమాన్స్ చేశాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ఉండదు. మలయాళం సినిమా లూసిఫర్ కు రీమేక్ ఇది. ఒరిజినల్‌లో హీరోయిన్ ఉండదు.. దాంతో కథను చెడగొట్టడం ఇష్టంలేక తెలుగులో కూడా అలాగే చేస్తున్నాడు చిరంజీవి. దీంతో పాటు మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి చెల్లెలి పాత్రలు కీర్తి సురేశ్‌ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

చాలా తక్కువ బడ్జెట్‌లో భోళా శంకర్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు మెహర్ రమేశ్‌. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా తమన్నా కన్ఫార్మ్‌ అయ్యేలా కనిపిస్తోంది. రెండేళ్ల కింద సైరా సినిమాలో చిరంజీవి, తమన్నా కలిసి నటించారు. అప్పుడు ఆమె వర్క్‌కు ఫిదా అయిన మెగాస్టార్ తమన్నాతో మళ్లీ నటించాలని ఉంది అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. పైగా ఇప్పుడు తమన్నా యంగ్ హీరోలతో నటించడం లేదు. సీనియర్ హీరోలతో ఎక్కువగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 2022లో మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులోనే భోళా శంకర్ కూడా ఉండబోతోంది. వేదాళంలో ఈ పాత్ర శృతి హాసన్ చేసింది. తెలుగు రీమేక్‌లో ఈ క్యారెక్టర్ తమన్నాకు వచ్చింది. మొత్తానికి చిరు, తమన్నా రెండోసారి స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ

సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..

ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!

Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!

అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement