e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ

Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ


Love story movie review

Love story movie review |మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలు, భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలతో తెలుగు చిత్రసీమలో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా శేఖర్‌ కమ్ముల గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని బలంగా విశ్వసిస్తుంటారాయన. తాను తీసే ప్రతి సినిమాలో ప్రజల్లో ఆలోచననే రేకెత్తించే ఎదో ఒక బలమైన సామాజికాంశాన్ని చర్చిస్తుంటారు. ఆ కోవలో ంఆయన రూపొందించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి తొలిసారి జంటగా నటించడం, సారంగదరియాతో పాటు మిగతా పాటలు, ప్రచార చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలవుతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా ఫలితం కోసం తెలుగు చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నది? సామాజిక ఇతివృత్తాన్ని అర్థవంతంగా శేఖర్‌ కమ్ముల తెరపై చెప్పగలిగాడా?లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే..

కథ ఏంటంటే..

- Advertisement -

రేవంత్‌(నాగచైతన్య) హైదరాబాద్‌లో జుంబా ఫిట్‌సెస్‌ సెంటర్‌ను నడుపుతుంటాడు. సొంతంగా ఫిట్‌సెన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసుకోవాలన్నది అతడి కల. నిమ్నకులంలో పుట్టడంతో చిన్నతనం నుంచి అవమానాల్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. అవన్నీ అతడిలో ఎదగాలనే పట్టుదలను మరింత పెంపొందిస్తాయి. మౌని(సాయిపల్లవి) ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వస్తుంది. తన అభద్రతాభావం, భయాల మూలంగా ఏ ఉద్యోగం ఆమెకు రాదు. డ్యాన్స్‌లో మౌనికి ఉన్న పరిజ్ఞానాన్ని గమనించిన రేవంత్‌ ఆమెను తన జుంబా సెంటర్‌లో భాగస్వామిగా చేర్చుకుంటాడు. రేవంత్‌తో పనిచేయడానికి తొలుత మౌని నిరాకరిస్తుంది. కానీ రేవంత్‌ మంచితనాన్ని చూసి ఒప్పుకుంటుంది. ఒకే ఊరికి చెందిన వారు కావడం, మనసులు కలవడంతో ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ మౌని అగ్ర కులానికి చెందిన అమ్మాయి కావడం, కుటుంబ కట్టుబాట్ల కారణంగా తన ప్రేమను గురించి ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరనే భయంతో ఇద్దరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలని అనుకుంటారు? కుల అడ్డుగోడలను దాటి రేవింత్‌, మౌని తమ ప్రేమను సఫలం చేసుకోగలిగారా? దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారా? బాబాయ్‌ అయిన నర్సింహను(రాజీవ్‌ కనకాల) చూసి మౌని ఎందుకు భయడుతుంది? చివరకు ఆ ప్రేమ జంట జీవితం ఏ తీరాలకు చెరుకున్నది అనేది ఈ చిత్ర ఇతివృత్తం.

ఎలా ఉంది?

సమాజంలో నెలకొన్న అసమానతలు, లైంగిక వేధింపులను చర్చిస్తూ శేఖర్‌ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు. అంతర్లీనంగా అందమైన ప్రేమకథతో పాటు తమ కలల సాధనం కోసం ఓ జంట పడే తపనను హృద్యంగా చూపించారు. కుటుంబసభ్యులు, పరిచయస్తుల చేతిలో ఎంతో మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలకు బయటకు చెప్పుకోలేక మనసులోనే వేదనను అనుభవిస్తుంటారు. అలాంటి అమ్మాయిన మానసిక వ్యథను వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. పిల్లల్లో ఉండే భయాల్ని, సంశయాల్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని చూపించారు. అధునిక ప్రపంచం వైపు అడుగులు పడుతున్నా ఇప్పటికీ పల్లెల్లో కుల వివక్ష, అంతరాల సమసిపోలేదు. కష్టించి పనిచేసే వాడి శ్రమను దోచుకుంటూ వారి ఉనికినే అగ్రకులాలు ప్రశ్నార్థకం చేస్తున్నారని శేఖర్‌ కమ్ముల చెప్పారు. చివరకు చావులో కూడా వివక్ష కనిపిస్తుందని, శ్మశానాలు కూడా కులాల బట్టే ఉంటాయంటూ సమాజంలో కనిపించే అణిచివేతను దర్శకుడు చూపించారు.


సామాజికాంశాలను సీరియస్‌ కోణంలో కాకుండా ఆహ్లాదభరిత ప్రేమకథతో ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రేమ చిహ్నాలను, ఆర్మూర్‌ పల్లె అందాలను మేళవిస్తూ రేవంత్‌, మౌనిక లవ్‌స్టోరీని అందంగా తెరపై ఆవిష్కరించారు. తమ కలల సాధన కోసం నగరానికి వచ్చిన రేవంత్‌, మౌనిలకు ఎదురయ్యే సమస్యలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం, సొంతంగా జుంబా సెంటర్‌ను ఏర్పాటుచేసే సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగుతుంది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో తమ ప్రేమను ముందుకు తీసుకెళ్లడానికి వారు పడే తపనతో ద్వితీయార్థం మొదలవుతుంది. అగ్ర కులాలకు అణగారిన వర్గాలకు మధ్య నెలకొన్న సంఘర్షణను చూపిస్తూ కథనాన్ని ఆసక్తికరంగా ముందుకు నడిపించారు శేఖర్‌కమ్ముల.రెగ్యులర్‌ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా పతాక ఘట్టాలను కొత్తగా చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్‌

ఇప్పటివరకు నాగచైతన్య అర్బన్‌ కథల్లోనే ఎక్కువగా నటించారు. ఆ శైలికి భిన్నంగా ఇందులో నిమ్న కులానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో కనిపించారు. కుల వివక్ష కారణంగా అవమానాలు ఎదుర్కొనే యువకుడిగా, సొంతంగా జీవితంలో పైకి రావాలని తపించే డ్యాన్సర్‌గా చక్కటి వేరియేషన్స్‌ చూపిస్తూ నటించాడు. రేవంత్‌ పాత్రలో పూర్తిగా లీనమైపోయి నటించాడు. పతాక ఘట్టాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. నటుడిగా అతడిని మరో మెట్టు పైకి తీసుకుపోయే చిత్రమిది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తెలంగాణ యాసను నేర్చుకున్నాడు. మౌని పాత్రలో సాయిపల్లవి అద్వితీయ అభినయాన్ని కనబరిచింది. కుటుంబం ప్రోత్సాహం లేకపోయినా సొంతంగా తన కాళ్లమీద తాను నిలబడాలనే సగటు అమ్మాయి స్ఫూర్తివంతంగా ఆమె పాత్రసాగుతుంది. తనకు ఎదురైన వేధింపులను మనసులోనే దాచుకుంటూ మదనపడే యువతిగా చక్కటి ఎమోషన్స్‌ పలికించింది. నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ పోటాపోటీగా నటించారు. నాయకానాయికల తర్వాత ఈశ్వరీరావు గుర్తుండిపోయే పాత్రలో కనిపించింది. కుల వివక్షను ఎదురించి ధైర్యంగా నిలబడే మధ్యతరగతి తల్లిగా చక్కటి నటనను కనబరిచింది.ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రాజీవ్‌కనకాల పర్వాలేదనిపించారు. ఉత్తేజ్‌, దేవయాని, ఆనందచక్రపాణి నటన బాగుంది.

టెక్నికల్‌గా..

శేఖర్‌ కమ్ముల ఎంచుకున్న పాయింట్‌ మంచిదే అయినా దానిని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమా సాగదీసిన అనుభూతి కలుగుతుంది. కథాగమనం నిదానంగా సాగుతుంది. సామాజిక సమస్యలను పైపైనే చర్చిస్తూ వెళ్లారు. లోతుగా చెప్పే అవకాశం ఉండి ఆ దిశగా ప్రయత్నించలేదు. సినిమాలో చర్చించిన అంశాలతో ఇదివరకు తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. ఈ సామాజిక ప్రేమకథకు తెలంగాణ యాస, పల్లెటూళ్లలో తెరకెక్కించిన సన్నివేశాలు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఆర్మూర్‌, పిప్రి గ్రామాల్లో సినిమాలోని కీలక ఘట్టాలను తెరకెక్కించారు.

ఆ పల్లె వాతావరణం కథను మరింత రియలిస్టిక్‌గా చూపించడానికి చక్కగా దోహదపడింది. తెలంగాణ యాస, భాషలకు పెద్దపీట వేస్తూ రాసిన సంభాషణలు బాగున్నాయి. తెలంగాణ పల్లె జీవనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూసిన అనుభూతికి లోనుచేస్తాయి. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కుమార్‌ పల్లె శోభను తన కెమెరాతో సహజంగా చూపించారు. పవన్‌ సీహెచ్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సారంగదరియా ప్రతి పాటను కథలో అంతర్భాగంగా వస్తూ ఆకట్టుకుంటాయి.
శేఖర్‌ కమ్ముల శైలి ప్రేమకథలకు భిన్నంగా ఉండే చిత్రమిది. మనసును హత్తుకుంటూనే ఆలోచింపజేస్తుంది. కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్‌కు దూరమయ్యారు. వారిని మళ్లీ థియేటర్స్‌కు రప్పించే చిత్రమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Siri: ప్రేమించిన వ్య‌క్తి చ‌నిపోయాడు.. వెక్కి వెక్కి ఏడ్చిన సిరి

Priyanka: నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని అన్నాడు..అమ్మ అయ్యేందుకు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టా..!

Kajal: త‌ల్లిదండ్రుల‌పైన పోలీస్ కంప్లైంట్ చేసిన కాజ‌ల్

Naga Chaitanya: స‌మంత‌తో విడాకుల విష‌యంపై నోరు విప్పిన నాగ చైత‌న్య

‌ పీఆర్ ఎజెన్సీ పెట్టుకున్న‌ ర‌ష్మిక మంద‌న్నా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement