Golden Boot: గోల్డెన్ బూట్ రేసు.. లీడింగ్‌లో మెస్సి, డేవిడ్
Golden Boot: ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌కు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అయితే ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్‌లోనే ఈ యేటి టోర్నీ సాగుతోంది. కానీ గోల్డెన్ బూట్ రేసులో ఇప్పుడు మెస్సీకి పోటీగా డేవిడ్ వచ్చేశాడు. ఆ ఇద్దరూ టోర్నీలో ఇప్పటికే హ్యాట్రిక్ గోల్స్ చేశారు.
న్కూయార్క్: ఫిఫా వరల్డ్‌కప్ 2026 .. ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. మేటి ప్లేయర్ల తమ ట్యాలెంట్ ప్రదర్శిస్తున్నారు. ఇక అడిడాస్ గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ, డేవిడ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే టోర్నీలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టారు. అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్‌కు గోల్డెన్ బూట్ అవార్డును ప్రజెంట్ చేసే విషయం తెలిసిందే. అర్జెంటీనా స్టార్ లియోనిల్ మెస్సీ గ్రూజ్ జేలో అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఆరో వరల్డ్‌కప్ ఆడుతున్న మెస్సీ.. ఇప్పటికే 16 గోల్స్ చేసి.. ఆల్ టైం లీడింగ్ స్కోరర్ మిరోస్లేవ్ క్లోస్‌తో సమంగా నిలిచాడు.
కోహోస్ట్ మెక్సికో ప్లేయర్ జోనాథన్ డేవిడ్ కూడా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు గోల్స్ తీశాడు. దీంతో మెస్సి, డేవిడ్‌లు.. గోల్డెన్ బూట్ రేసులో ముందున్నారు. ప్రస్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ దశలోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మరో వైపు అనేక మంది మేటి ప్లేయర్లు కూడా గోల్డెన్ బూట్ రేసులో ఉన్నారు. కైలియన్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్, హ్యారీ కేన్ కూడా ఆ రేసులో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 9 మంది ప్లేయర్లు రెండేసి గోల్స్ చేశారు.
ఒకవేళ టోర్నీలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్లేయర్లు అత్యధిక స్థాయిలో గోల్స్ చేస్తే, అప్పుడు అసిస్ట్‌ల ఆధారంగా గోల్డెన్ బూట్ విజేతను నిర్ధారిస్తారు. గోల్ స్కోరింగ్ చేసే ప్లేయర్‌కు ఎంత మంది బంతిని అందిస్తారో దాని ఆధారంగా అసిస్ట్‌లను ఫిఫా టెక్నికల్ టీమ్ నిర్ణయిస్తుంది. ఒకవేళ అసిస్ట్‌లు కూడా సమానంగా ఉంటే, అప్పుడు టోర్నీలో ఆ ప్లేయర్ ఎన్ని నిమిషాలు ఆడారన్న దాని ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

