బిగ్ బాస్ కార్యక్రమంలో హౌజ్‌మేట్స్‌ని తమ తొలి ప్రేమ అనుభవాలు, జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ క్రమంంలో ఒకరి తర్వాత ఒకరు తమ తొలి ప్రేమ విషయాలు చెబుతూ కన్నీరు పెట్టించారు. సిరి హనుమంత్ తన పదో తరగతి లవ్ స్టోరీ చెబుతూ చాలా ఎమోషన్ అయింది. నేను విష్ణు అనే వ్యక్తిని ప్రేమించాను. అతను మా ఇంటికి ఎదురుగా ఉండేవాడు.
ఓరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు.. తనంటే నాకూ ఇష్టమే కావడంతో ఎప్పుడెప్పుడు చెప్తాడా? అని నేనూ వెయిట్ చేసి.. చివరికి ఓకే చెప్పేశా. అయితే అతను నేను ఎవరితో అయిన మాట్లాడితే అస్సలు ఒప్పుకునే వాడు కాదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయింది. ఆ టైంలోనే నాకు పెళ్లి సంబంధం వచ్చింది. అతని మీద కోపంతో ఒప్పుకున్నాను. రేపు ఎంగేజ్మెంట్ అనగా నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడ్చేశాడు. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా ఉండలేనంటూ నన్ను కన్విన్స్ చేశాడు.
అతనంటే కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి తెల్లవారితే ఎంగేజ్మెంట్ కాబట్టి.. రాత్రికి రాత్రి అతనితో జంప్ అయ్యాను. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ నాకు సర్ధి చెప్పి తీసుకొచ్చింది. కొన్నాళ్లు మేం ఇద్దరి మంచి రిలేషన్ షిప్లో ఉన్నాం. తర్వాత పలుమార్లు గొడవలు అయ్యాయి. ఓ రోజు ఉదయం 3 గంటలకు మెలుకువ వచ్చింది. మళ్లీ పడుకొని 8 గంటకు లేచా. అప్పుడు విష్ణు చనిపోయాడనే బ్యాడ్ న్యూస్ విన్నాను.
నాకు ఎప్పుడైతే మెలుకువ వచ్చిందో ఉదయం 3 గంటలకు అప్పుడే తను యాక్సిడెంట్‌కి గురై చనిపోయినట్టు తెలిసింది. తన కోసం నేను ఎంతో చేశా.. కానీ తనని ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. తనని నేను మర్చిపోలేకపోతున్నా.. ఐ లవ్యూ విష్ణు’ అంటూ సిరి చాలా ఎమోషనల్ అయింది.