బిగ్ బాస్ హౌజ్‌లో గురువారం రోజు తొలి ప్రేమల్ని గుర్తు చేసుకున్నారు ఇంటి సభ్యులు. ఇందులో భాగంగా కాజల్ తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. తనది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పిన కాజల్.. ఈమెయిల్ ద్వారా ముచ్చటించుకుందాం అని అంది. తన ప్రేమ విషయం తెలిసి పేరెంట్స్ వైజాగ్ పంపారట.
కొద్ది రోజులకి తనను మళ్లీ ఇంటికి తీసుకు రాగా, ఆమె 100కు డయల్ చేసి బలవంతంగా తననుఇంట్లో ఉంచారని పోలీసులకి చెప్పిందట. అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు. పోలీసులు రాగానే వెంటనే వాళ్లతో వెళ్లిపోయాను. కానీ తాను తప్పు చేసిన విషయం నాకు కూతురు పుట్టాక అర్ధమైందని పేర్కొంది.
ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌజ్‌కి వచ్చాక నా భర్తని, పాపని వాళ్లే చూసుకుంటున్నారు.వారున్నారనే ధైర్యంతో ఇక్కడ సంతోషంగా ఉండగలుగుతున్నాను అని కాజల్ పేర్కొంది.
ఇక షణ్ముఖ్.. 8వ తరగతి నుంచి ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఇంటర్ సెకండియర్‌లో ఆమె బర్త్‌డే రోజు ప్రేమను వెలిబుచ్చాను. కానీ ఈ ప్రేమలో ఫెయిలయ్యాను. ఆ సమయంలోనే పట్టుదలతో నటన, డ్యాన్స్ నేర్చుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక విశ్వ ఆరోగతిలో సుమలత అనే అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. నా ఫస్ట్ హీరోయిన్ ఆమెనే. కాని చనిపోయిందని ఎమోషనల్ అయ్యాడు.