FIFA World Cup: దక్షిణ కొరియాపై విజయం.. నాకౌట్లోకి మెక్సికో ఎంట్రీ
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో మెక్సికో రెండో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణ కొరియాపై 1-0 గోల్స్ తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్‌కప్‌లో కోహోస్ట్ మెక్సికో జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించింది. గ్రూప్ ఏ నుంచి రౌండ్ 32లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణ కొరియా దేశంపై 1-0 గోల్స్ తేడాతో మెక్సికో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఖాతాలోకి ఆరు పాయింట్లు చేరాయి.గడలజరాలో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో ప్లేయర్ లూయిస్ రోమో 50వ నిమిషంలో తన జట్టు తరపున గోల్ చేశాడు. గోల్ కీపర్ కిమ్ సెంగ్ యూ గోల్ అందుకున్న తర్వాత అతనికి ఓ ఫీల్డర్ ఢీకొన్నాడు. దీంతో అతని చేతుల్లోంచి బంతి జారింది. ఆ సమయంలో అక్కడ ఉన్న రోమో అద్భుతమైన రీతిలో గోల్స్ చేశాడు.
ఆట 87వ నిమిషంలో దక్షిణ కొరియా ప్లేయర్ చో గు సంగ్‌కు గోల్ కొట్టే ఛాన్సు వచ్చింది. కానీ రౌల్ రంగేల్ దాన్ని అడ్డుకున్నాడు. స్వదేశీ మైదానంలో ప్రేక్షకుల నుంచి మెక్సికో జట్టుకు పూర్తి మద్దతు లభించింది. 75వ నిమిషంలో మెక్సికో రెండో గోల్ చేసే అవకాశాన్ని తృటిలో మిస్సైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియా ఓడినా.. గ్రూపులో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌పై దక్షిణ కొరియా విజయం సాధించిన విసయం తెలిసిందే. తన తర్వాత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్‌తో మెక్సికో పోటీపడనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- fifa worldcup
- knockouts
- Mexico
- Romo
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

