Priyanka: నాకు పిల్లలు పుట్టరని అన్నాడు..అమ్మ అయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టా..!

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ ప్రియాంక..తన కన్నీటి ప్రేమ గాథను చెప్పి వెక్కివెక్కి ఏడ్చింది. ‘అతని పేరు రవి.. అలా పిలవడం నాకు ఇష్టం లేక నేను ముద్దుగా అబ్బాయి అంటూ ఉంటా. ఓ ఫంక్షన్లో అతన్ని చూసి మనసు పడ్డాను.ఇద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం. ఆరేళ్లు రిలేషన్లో ఉన్నాం. తనంటే నాకు చాలా ఇష్టం.
మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది.. నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి.. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా.. అమ్మాయిగా మారిన తరువాత కొన్నాళ్ల పాటు అతనికి కనిపించలేదు. ఓ రోజు అతన్ని కలిసి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పా. అతను ఓకే చెప్పి, ఇద్దరం రిలేషన్ షిప్లో ఉందాం అని అన్నాడు. నాకు తోడు దొరికిందని సంతోషపడ్డాను .
ఓ రోజు నా దగ్గరకు వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అన్నాడు. మరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అబ్బాయ్ అని అంటే.. నువ్ ఏమైనా అమ్మాయివా?? నీకు పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్? పెళ్లి ఏంటి పెళ్లి అని చిరాకు పడ్డాడు.. ఎందుకంటే నేను తల్లిని కాలేను. నీకు తెలుసో తెలియదో అబ్బాయ్.. నేను చాలా హాస్పటల్స్ తిరిగాను.. తల్లిని కావడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టా.
అతను నాకు కావాలని ప్రాధేయపడ్డా. కాళ్ల మీద పడ్డాను.అయిన తను నన్ను వదిలేసి వెళ్లాడు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలులే. ఓ రోజు అతను గుర్తొస్తుంటే ఇంటికి రా అని మెసేజ్ పెట్టా. అతను వచ్చి నన్ను చాలా బాధ పెట్టాడు. నువ్వు ఎవరో తెలుసా అంటూ అదే మాటను వందల సార్లు అని నన్ను హర్ట్ చేశాడు. నువ్ నన్ను ఇష్టపడినా పడకపోయినా నేను నిన్ను ఇష్టపడ్డా.
నువ్ ఒకటి గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు ఈ పింకీ ఉంటుంది.. ఐ లవ్యూ.. ఐ మిస్ యూ. నీకు నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్ మళ్లీ నా లైఫ్‌లోకి రావద్దు.. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు’ అని చాలా ఎమోషనల్ అయంది ప్రియాంక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

