Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ బర్త్‌డేకు బాలయ్య గిఫ్ట్.. ‘NBK111’లో హీరోయిన్గా ఎంట్రీ, ఫస్ట్ లుక్ విడుదల
NBK 111 | నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ నుంచి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ నుంచి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని వారాలుగా ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది.
ఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కాజల్ సింపుల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి అత్యంత గంభీరంగా కనిపించింది. కార్యాలయ వాతావరణంలో నిలబడి ఉన్న ఆమె లుక్‌లో సీరియస్‌నెస్, పవర్ఫుల్ వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ను ఇలా డీ-గ్లామర్ లుక్‌లో చూపించడంతో పాత్రపై క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. పోస్టర్‌తో పాటు చిత్ర బృందం కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. ‘భగవంత్ కేసరి’లో కాజల్ పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘NBK111’లో మాత్రం ఆమె పూర్తి స్థాయి కథానాయికగా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్ల మేళవింపుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

