Anushka Shetty | అనుష్కకు అప్పటిదాకా పెళ్లి కాదా.. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే..

Anushka Shetty | అనుష్క శెట్టి పెళ్లి గురించి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈమె వయసు 40కి చేరువైంది. అప్పుడెప్పుడో 2005లో సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది అనుష్క. దాదాపు 50 సినిమాల వరకు నటించింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టిన జేజమ్మ.. ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ తగ్గించింది. యంగ్ హీరోలకు అనుష్క ఫిజిక్ సరిపోదు.. సీనియర్ హీరోలందరితో నటించడంతో ఆమెను రిపీట్ చేయడానికి నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది అనుష్క.
గత కొన్ని ఏళ్లుగా కేవలం ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ వైపు అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. గత రెండేళ్లుగా అవి కూడా చేయడం లేదు. నిశ్శబ్దం సినిమా దారుణంగా నిరాశ పరచడంతో కొన్ని రోజులు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది అనుష్క శెట్టి. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేశ్ చెప్పిన ఒక కథ అనుష్కకు నచ్చినా కూడా.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి పూర్తిగా ఖాళీ అయిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. దాంతో అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో మరోసారి వార్తలు మొదలయ్యాయి. దీనిపై ఒక జ్యోతిష్కుడు అసలు విషయం బయట పెట్టాడు.
అనుష్క గురించి బాగా తెలిసిన ఒక గురూజీ.. జేజమ్మ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుష్క తన వృత్తిలో చాలా సిన్సియర్ గా ఉంటుందని.. అలాగే ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు. కచ్చితంగా బయట వ్యక్తినే అనుష్క పెళ్లి చేసుకుంటారని.. 2023 లోపు ఈమె పెళ్లి జరుగుతుంది అంటూ గురూజీ తెలిపారు. మరి ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
Love Story | లవ్‌స్టోరి దర్శకుడికి ఊహించని లాభం !
అందుకే ఇండియా వదిలేసి వెళ్లిపోయాను : మల్లికాశెరావత్
సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

