సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ వీడియో ఒక్కటి కూడా బయటికి రాలేదు. దాంతో ఆయన బాగానే ఉన్నాడని చెబుతున్నా కూడా.. ఆస్పత్రిలో ఆయన ఎలా ఉన్నాడో అనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. పైగా సర్జరీ జరిగిన తర్వాత సాయి ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం మెగా కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారికంగా చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ వేడుకలో తేజూ ఆరోగ్యం గురించి పవన్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు ఎలా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది.. తదితర విషయాలపై అభిమానులకు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాడు పవర్ స్టార్. మరోవైపు సినిమా కంటే కూడా సాయి ధరమ్ తేజ్ గురించి పవన్ ఏం చెప్తాడు అనే విషయం గురించి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సాయి ఆరోగ్యం బాగానే ఉందని.. అయితే మెడ సమీపంలో కాలర్ బోన్ సర్జరీ జరగడంతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడని.. మరి కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో బయటికి రావడానికి మాత్రం కనీసం నెల రోజులకు పైగానే పడుతుందని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏదేమైనా మెగా కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన కనీసం ఒక్క ఫోటో గాని.. వీడియో గాని విడుదల చేస్తే అనుమానాలు అన్నీ పటాపంచలైపోతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
Siri: ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు.. వెక్కి వెక్కి ఏడ్చిన సిరి
Priyanka: నాకు పిల్లలు పుట్టరని అన్నాడు..అమ్మ అయ్యేందుకు లక్షలు ఖర్చు పెట్టా..!
Kajal: తల్లిదండ్రులపైన పోలీస్ కంప్లైంట్ చేసిన కాజల్
Naga Chaitanya: సమంతతో విడాకుల విషయంపై నోరు విప్పిన నాగ చైతన్య
పీఆర్ ఎజెన్సీ పెట్టుకున్న రష్మిక మందన్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

