ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!

ఎన్ని రోజులైంది థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి..! ఎన్ని రోజులు అయ్యుంటుంది టికెట్స్ లేవు అని థియేటర్ వాళ్లు ప్రేక్షకులకు చెప్పి..! ఎన్ని రోజులైంది రికార్డు ఓపెనింగ్స్ అనే మాట నిర్మాతలు విని..! కరోనా వైరస్ దెబ్బకు గత కొన్ని నెలలుగా తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. మధ్యమధ్యలో ఎస్ఆర్ కళ్యాణమండపం, సీటీ మార్ లాంటి సినిమాలు జస్ట్ ఓకే అనిపించినా కూడా లాంగ్ రన్ మాత్రం చూపించలేదు. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైన నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా.. రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చేందుకు బాక్సాఫీస్ దగ్గర అన్ని సిద్ధమయ్యాయి.
తొలి మూడు రోజుల పాటు చాలా థియేటర్స్‌లో టికెట్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయిపోవడం చూసిన తర్వాత.. నిర్మాతల ఆనందం మామూలుగా లేదు. కేవలం లవ్ స్టోరీ నిర్మాతలు మాత్రమే కాదు.. మిగిలిన సినిమాల నిర్మాతలు కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇదే వాతావరణం చాలా రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో రావాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు. ఏ సినిమా అయినా కూడా ఓటీటీలో చూద్దాంలే.. థియేటర్ వరకు ఎందుకు వెళ్లడం అనే ఆలోచనలు చాలామంది ప్రేక్షకులలో వచ్చాయి. వాటిని పోగొట్టాలి అంటే పెద్ద సినిమాలు విడుదల కావాలి. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ ఈ విషయంలో అందరి కంటే ముందు వచ్చింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే తొలి రోజు సినిమాకు యావరేజ్ టాక్ రావడం ఒక్కటే మైనస్. కానీ సాయి పల్లవి మరోసారి మ్యాజిక్ చేసింది. దానికి తోడు నాగచైతన్య కూడా పాత్రలో లీనమై నటించాడు. లీడ్ పెయిర్ ఇద్దరు అద్భుతంగా నటించడంతో కచ్చితంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం అయిపోయింది. అయితే సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం.. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ అన్నీ కళకళలాడాయి.
చాలా అంటే చాలా థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ అనే బోర్డులు దర్శనమిచ్చాయి. ఇదే ఉత్సాహం రాబోయే సినిమాల విషయంలో కూడా కనిపిస్తే తెలుగు ఇండస్ట్రీ గాడిన పడడానికి ఎంతో సమయం పట్టదు. అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. 8న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. 14న శర్వానంద్, సిద్ధార్థ్ మహా సముద్రం లాంటి సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇవి గాని విజయం సాధిస్తే పెద్ద సినిమాలకు గేట్స్ ఓపెన్ అయినట్లే. అఖండ, ఆచార్యలతో పాటు మరో 10-15 పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
Love Story | లవ్‌స్టోరి దర్శకుడికి ఊహించని లాభం !
అందుకే ఇండియా వదిలేసి వెళ్లిపోయాను : మల్లికాశెరావత్
సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

