సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..

ఇది ఒకరో ఇద్దరో కాదు.. చాలామంది అంటున్న మాట. నాలుగేళ్ల కింద ఫిదా సినిమా విడుదలైనప్పుడు చాలామందికి సాయిపల్లవి పిచ్చి పట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు ఈ పిల్ల.. ఇలా ఉంది.. స్క్రీన్‌పై ఇలా మ్యాజిక్ చేస్తుంది ఏంటి అని చాలామంది ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సాయిపల్లవికి అభిమానులు వచ్చారు. ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు హీరోలను కూడా చూడటం మానేశారు. పెద్ద హీరోల సినిమాల్లో సాయిపల్లవిని తీసుకోకపోవడం వెనుక కారణం కూడా ఇదే కావచ్చు. ఆమె వెండితెరపై కనిపిస్తే పక్కన ఎవరూ కనిపించరు. అంతగా స్క్రీన్ తినేస్తుంది సాయిపల్లవి. తాజాగా విడుదలైన లవ్ స్టోరీ సినిమాలో కూడా ఇదే జరిగింది.

లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య నిజంగా తన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అయినా కూడా అక్కడ సాయిపల్లవి ముందు తేలిపోయాడు. ఇది అందరూ ఒప్పుకునే తీరాల్సిన నిజం. అంతెందుకు అక్కినేని అభిమానులు కూడా సాయిపల్లవి నటనను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే కేవలం సాయిపల్లవి కోసం ఒకసారి చూడొచ్చు.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి అంటే ఈ ముద్దుగుమ్మ స్థాయి ఏంటో అర్థం అవుతుంది. ఈ పిల్లలో ఏదో మ్యాజిక్ ఉంది అబ్బా అంటూ అందరూ సాయిపల్లవికి ట్యూన్ అయిపోతున్నారు.

కేవలం వెండితెరపై మాత్రమే కాదు యూ ట్యూబ్‌ను మకుటంలేని మహారాణిగా ఏలేస్తుంది సాయిపల్లవి. ఈమె చిందేసిన రౌడీ బేబీ పాటను 120 కోట్ల మంది చూశారు ఫిదా, ఎంసీఏ సినిమాలోని పాటలు కూడా సంచలనం సృష్టించాయి. ఈ కోవలోనే లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట గత 7 నెలలుగా యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ జానపద గేయానికి జై కొడుతున్నారు. ఈ పాట 350 మిలియన్ క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. సాయి పల్లవి మూడోసారి 300 మిలియన్ మార్క్ అందుకుంది. ఇదివరకే ఫిదా సినిమాలోని వచ్చిండే పాట 300 మిలియన్ మార్క్ అందుకుని చరిత్ర సృష్టించింది. సారంగదరియా కూడా 300 మిలియన్ మార్క్ దాటడంతో సాయి పల్లవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏదేమైనా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి ఇమేజ్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతూ పోతుంది. లవ్ స్టోరీ కూడా దీనికి మినహాయింపు కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
ఇదే కదా నిర్మాతలు కోరుకుంది.. లవ్ స్టోరీ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ పక్కా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

